29, ఏప్రిల్ 2013, సోమవారం

గుండె గొంతుకలో ... అభిసారిక



అంతర్ముఖంలో నిరంతరం
అలుపెరుగని పయనం నీది
ఎదురుచూచు నయనం నాది
తీరంచేరేదెన్నటికో!













ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

బావగా మనసున నిలిచి
మధుర బంధాలు పెంచి
గాలిబుడగలో చందమామవై
అంతరిక్షాన క్షణభంగురమయ్యావు!

**********
మమత మనసులో మరిగి
గాలిలో బుడగగా మారి
మరచిన ప్రియుని మది దెచ్చి
మరుక్షణమే మరలితివా సఖా!
 





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



ఉషోదయ ఊహలతో
ఊసులాడిన మనసుతో
అరుణ కిరణ రంజితయై
అలవోకగా సేద తీరు వేళలో!


ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

మనసులో మమతల తలపు
కురులలో కొత్త వలపు
మనసైన తొలి వలపు
కురులతో కలగలుపు
**********

ప్రేమంటే చిక్కు ముడి
పెళ్ళంటే దక్కు ముడి
ఫలిస్తే దక్కు వొడి
వికటిస్తే అదే పీఠ ముడి!




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

అందగత్తె నేనుండ
అందలంబెక్కావు
అల్లంత దూరాన్నున్న
ఆ జాబిలికై ఆ చూపులేల?



ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

అందాల నా రాజు
నా రోజాలో నీ పై మోజు
కనిపించావు ప్రతి రోజు
తిలకించితి నీ ఫోజు






ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

28, ఏప్రిల్ 2013, ఆదివారం

'గుండె గొంతుకలో ' .... అభిసారిక


http://www.eenadu.net/Specialpages/etharam/260413eta9b.jpg 






కాఫీతో పరిచయం 
మనస్సులో కలవరం 
సాఫీగా మన స్నేహం 
పొగలు సెగలై తేలాలి!

----------------------

చేజిక్కిన టీకప్పుతో 
ఆవిరులైన నీ వూపిరిలో 
తేనీటి పరిచయాలు 
తీయటి జ్ఞాపకాలు. 





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

జగమంతా నాదమయం


ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

జగమంతా నాదమయం


హృదయపు తోటలో ప్రకృతి మురియగ
భావపు అలలే మనమున విరియగ

వాయు లీనమై మాటల ఊటలు తొణికిసలాడగా
నాలుకపై నర్తన జేసి పెదవుల తోడై ప్రవచింపగ
వాక్కుగా మారి నాద పూరక రుక్కులై వేదములయ్యె!

తప తప మంటూ అలల తాకిడితో సృష్టికి నాందిగా
సంద్రమె బ్రహ్మను తపస్సు చేయమనె గద!

గలగల పారే జలకళతో నదీమతల్లియె
కళకళలాడుతు నుండమని ఆశీర్వదించలేదా!

భయద ఘర్జనతో కారు మేఘాలే విను వీధి నుండి
మిలమిల మెరిసే చినుకులు రాల్చి శుద్ధ జలాలనిచ్చుట లేదా!

శిశిరాన ప్రకృతి విలవిలలాడగ చైత్ర గీతితో
సుమలతల ఘుమఘుమలతో విప్పారి తలలూపుటలేదా!

వసంత గీతితో పక్షుల కువకువ కేళీరవళితో
గండు కోయిలల కుహుకుహు నాద వినోదము కల్గుటలేదా!

రంగురంగుల సుమబాలల చెవిలో ఝుంకార ధ్వనితో
తేటియె గుసగుసలాడుతు మకరందమె గ్రోలుట లేదా!

మామిడి తోటలో కిచకిచమంటూ మారుతి దూరి
కాయలన్నియు హాయిహాయిగా కొరికి తినుటలేదా!
పిల్లకాయలందరు గుమికూడి పకపక నవ్వుట వినలేదా!

నిత్యనాద ప్రకృతియె జననినాదమై
శృతి బద్ధమగు ధ్వని సంకేతాలే
శబ్ధతరంగములై నాద రూపమై
వేద మంత్రమై అమర భాష లోనె
దేశ భాషలన్ని దేవ భాషలోనొదిగి
అన్నింటి మూలమూ ఓంకార శబ్దంబె
యనితెలియవలయు.

దేవులపల్లి భావ కవితలా
అన్నమయ్య పద కవితలా
ప్రకృతి నేర్పిన పాఠమిది!
పదాల ధ్వనుల పుట్టుక ఇది!
భాషకు ప్రాణమిదియె కదా!